అవినాష్’కు అరియానా పడిపోయింది !
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా పది వారాలని పూర్తి చేసుకోబోతుంది. ఈ పది వారాల్లో బిగ్ బాస్ ఇంట్లో మూడు ఏర్పడినట్టు తెలుస్తోంది. అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరుగాక అవినాష్ అరియానానిని గోకడం, అరియానా కూడా అప్పుడప్పుడు అవినాష్ ని గోకడం ప్రేక్షకులు చూశారు. అయితే అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడంటే.. అరియానా తట్టుకోలేకపోయింది. బోరన ఏడ్చేసింది.
బయటికెళ్లాక ఆత్మహత్య చేసుకోకు. నేను వస్తా. నా కోసం బతుకు అని ఎమోషనల్ అయింది. ఇక నిన్నటి ఏపీసోడ్ లోనూ అవినాష్-అరియానాల మధ్య ఆసక్తికర సీన్ జరిగింది. నువ్ ట్రై చేసిన నేను పడనులె అని అరియానా అంది. ఛ.. నీకు అంత సీన్ లేదు. అసలు నేనే పడను అన్నాడు అవినాష్. ఈ క్రమంలో ఇద్దరు మధ్య రొమాంటిక్ లుక్స్ జరిగాయ్. చూస్తుంటే.. అవినాష్ కి అరియానా పడిపోయినట్టే కనిపిస్తోంది. చాలా క్లెవర్ పిల్లా.. ఆఖరికి అవినాష్ ని ఏం చేస్తుందో చూడాలి.