100 కోట్ల రౌడీ బేబీ

ధ‌నుష్-సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం ‘మారి 2’. ఈ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ్, హిందీ ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. తాజాగా రౌడీ బేబీ సాంగ్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

యూట్యూబ్ ఈ పాట‌కు 1 బిలియ‌న్ వ్యూస్ సాధించింది. ఈ రికార్డు సాధించిన తొలి ద‌క్షిణాది పాట‌గా నిలిచింది. కొల‌వెరీ డీ పాట 9వ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్న రోజే రౌడీ బేబీ పాట 1 బిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం యాదృచ్చికం. ఈ రికార్డు సాధించ‌డం గొప్ప స‌త్కారంగా భావిస్తున్నా. పాట‌ల‌ను ఆద‌రిస్తున్న ప్ర‌జ‌లంద‌రికీ మా టీం తరుపున కృత‌జ్ఞ‌త‌లు అని ధనుష్ ట్వీట్ చేశాడు.