టీఆర్ఎస్ మాత్రమే కాదు.. కాంగ్రెస్ టార్గెట్ కూడా భాజాపనే !

దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో తెలంగాణ భాజాపాకు బలమొచ్చింది. తెలంగాణలో ఇక కాంగ్రెస్ ఖతం. తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపానే. రాబోయే రోజుల్లో తెలంగాణలో భాజాపా అధికారంలో వస్తుందని నేతలు మాత్రమే కాదు.. ప్రజలుకూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తం అయింది. ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి భాజాపాని టార్గెట్ చేశారు.

తెలంగాణలో భాజపా ఎన్నటికీ బలపడలేదని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందంటూ భాజపా అసత్య ప్రచారం మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వరద సహాయంలో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.