గ్రేటర్ లో బీజేపీని గెలిపించబోతున్న ఎంఐఎం
వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించినా.. ఇదీ నిజం. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఇచ్చిన కిక్కులో గ్రేటర్ లోనూ దూసుకెళ్లాలని తెలంగాణ భాజాపా భావిస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొదటి నుంచే ఎంఐఎం, తెరాస ఒక్కటే అని ప్రచారం మొదలెట్టింది. ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు తెరాస డీల్ సెట్ చేసుకుంది. తెరాసకు ఓటేస్తే ఎంఐఎం కు ఓటేసినట్టేనని భాజాపా నేతలు ప్రచారం మొదలెట్టారు. దీంతో తెరాసకు ఓటేద్దామని ఫిక్సయిన ప్రజలు ఇప్పుడు ఆలోచలో పడ్డారు. నిజంగానే తెరాసకు ఓటేస్తే ఎంఐఎం కు ఓటేసినట్టేనా ? మళ్లీ ముస్లింల రాజ్యం వస్తుందా ? అని జంకుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ఎంఐఎం సహకారం లేనందు వలనే తెరాస ఓడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గ్రేటర్ లో ఎంఐఎం సహకారం లేకుండా కారు.. జోరు చూపించడం కష్టం. ఈ నేపథ్యంలో ముందుస్తుగా ఎంఐఎం తో తెరాస మేయర్ పదవి ఇస్తానని డీల్ సెట్ చేసుకుందని భాజాపా నేతలు ప్రచారం మొదలెట్టారు. అలాంటి డీల్ ఏం చేసుకోలేదు. ఎంఐఎం తో మాకు అవసరం లేదని చెప్పే ధైర్యం తెరాసకు లేదు. మొత్తంగా ఒకవేళ భాజాపా వ్యూహం ఫలించి.. గ్రేటర్ లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేస్తే.. దానికి ఎంఐఎం నే కారణమని చెప్పవచ్చని చెప్పుకొంటున్నారు.