చిరుకి రూ. 60కోట్ల పారితోషికం


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం చిరు రూ. 50కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఇక ఆచార్య తర్వాత వేదాళం తెలుగు రిమేక్ లో నటించబోతున్నారు చిరు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ సినిమా కోసం చిరు ఏకంగా రూ. 60కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని చిత్రబృందం చెబుతోంది.

వాస్తవానికి పారితోషికం విష‌యంలో నిర్మాత‌ల‌కూ, చిరుకీ మ‌ధ్య ఎలాంటి బేర‌సారాలూ జ‌ర‌గ‌లేదట‌. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి చిరు సినిమా చేయ‌డం ఖాయమైంది. అంతే త‌ప్ప‌.. పారితోషికం ఇంత అని ఫిక్స‌వ్వ‌లేదు మెగా కాంపౌండ్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలియ‌జేశాయి. వేదాళం రీమేక్ వచ్చే యేడాది మార్చిలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.