త్రిష షాకింగ్ డిసిషన్.. జీవితాంతం ఒంటరిగానే !
హీరోయిన్ త్రిష పెళ్లి న్యూస్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. ఇటీవల త్రిశ శింబుని పెళ్లాడబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై త్రిష క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకోనని నేనెప్పుడూ చెప్పలేదు. తప్పకుండా చేసుకుంటా. నా ఇష్టాల్నీ, నా అభిరుచుల్నీ, నా వృత్తినీ గౌరవించేవాడ్ని పెళ్లి చేసుకుంటా”నని తెలిపింది.
ఒకవేళ అలాంటివాడు దొరక్కపోతే.. అసలు పెళ్లే చేసుకోను. జీవితాంతం ఒంటరిగా ఉండడానికి సైతం నేను సిద్ధమేనని త్రిష చెప్పుకొచ్చింది. ఒంటరిగా బతికే ధైర్యం, తెగువ తనకున్నాయని, ఆడవాళ్లు ఎవరి తోడూ లేకుండా మనుగడ సాధించగలరని త్రిష నమ్మకంగా చెబుతోంది. చూస్తుంటే బ్రహ్మచారిణిగా మిగిలిపోవడానికి త్రిష గట్టిగానే ఫిక్సయిపోయినట్టుంది. అందుకే పెళ్లి కోసం తొందరపడటం లేదేమో.. !