ఏప్రిల్’లో వకీల్ సాబ్, అక్టోబర్’లో ఆర్ఆర్ఆర్ !

కరోనా కారణంగా టాలీవుడ్ సినిమాల షెడ్యూలు అంతా అతలాకుతలం అయిపోయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మెగాస్టార్ ఆచార్య, బన్నీ పుష్ప , త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఇవన్నీ ఎప్పటికి థియేటర్లలోకి వస్తాయి అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం..  ‘వకీల్ సాబ్’ సంక్రాంతి బరి నుంచి దాదాపు తప్పుకున్నట్లే. 2021 ఏప్రియల్ విడుదల దిశగా ఆ సినిమా నడుస్తోంది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ 2021 అక్టోబర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప సినిమాను ఎలాగైనా పోస్ట్ సమ్మర్ కు రెడీ చేయించాలి చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మార్చి నుంచి సెట్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్ మీదకు వెళ్లినా అది విడుదల మాత్రం 2022 సంక్రాంతికే అని తెలుస్తోంది.