అంత‌ర్జాతీయ స్థాయిలో రానా రియాలిటీ షో !


బడా దర్శక-నిర్మాతలు, బడా బ్యానర్ల దృష్టి ఓటీటీలపై పడింది. స్టార్ హీరో-హీరోయిన్లు అటు వైపు చూస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ఆహా కోసం ‘సామ్-జామ్’ మొదలెట్టింది. హీరో రానా దగ్గుబాటి కూడా సమంత దారిలోనే ఓ రియాలిటీ షోకి ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతుందని చెబుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ రియాలిటీ షో కి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

ఇప్ప‌టికే చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు రానా. కొత్త ప్రాజెక్టుల్ని ఒప్పుకోవ‌డానికి కాల్షీట్లు అంగీక‌రించ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ ఈ షోకి స‌మ‌యం కేటాయించాడు రానా. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి రానా తెరను పంచుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.