కేసీఆర్ మరోసారి ‘యాంటీ బీజేపీ కూటమి’ పాట.. !

‘నువ్ నన్ను గెలికితే.. నేను నిన్ను గెలుకుతా’. రాజకీయ నేతలు ఈ లైన్ ని ఫాలో అవుతుంటారు. తెలంగాణలో తెరాసని గెలికింది భాజాపా. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొందింది. గ్రేటర్ లో దగ్గా పోరు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి యాంటి బీజేపీ కూటమి పదం ఎత్తుకున్నారు. గురువారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికలు ముగియగానే.. దేశ రాజకీయాలని ఒక్కటి జేస్తా. యాంటీ బీజేపీ కూటమిని ఏర్పాటు చేస్తా. కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్లుటదో మీకు తెలుసు అన్నారు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలని కలిశారు. చర్చించారు. కానీ.. కూటమిని ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి.. సీఎం కేసీఆర్ యాంటీ బీజేపీ పాట ఎత్తుకోవడం విశేషం. దీని వెనక బలమైన కారణముందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో భాజాపా బలపడుతోంది. దాన్ని అడ్డుకోవాలంటే.. కేంద్రంలో దానికి ధీటుగా ఓ కూటమిని ఏర్పాటు జేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. కానీ అంత ఈజీ కాదని కూడా చెబుతున్నారు.