కేసీఆర్’కు ఉగ్రవాదులతో సంబంధాలు.. కేటీఆర్ కౌంటర్ !

గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయ్. నేతల మాటలు కోటలు దాడుతున్నాయ్. హద్దులు మీరి మరీ.. ఆరోపణలు చేసుకుంటున్నారు.  తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఎంఐఎంతో కుమ్మక్కైనందున సీఎం కేసీఆర్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. నిఘా సంస్థలు కేసీఆర్ కదలికలను డేగకళ్ళతో కనిపెడుతుండాలి’అని ట్విట్ చేశారు. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

‘ఎంపీ గారు.. రాజకీయాలు హుందగా ఉండాలి. దిగజారి మాట్లాడొద్దు. మీ మాటలు మీ దిగజారుడు తనానికి నిదర్శనం’మని కేటీఆర్ ట్విట్ చేసారు. ఇక గ్రేటర్ ఎన్నికలకి సంబంధించి తెరాస అభ్యర్థులు పూర్తి స్థానాలకి నామినేషన్స్ దాఖలు చేశారు. తెరాస అభ్యర్థులంతా తెరాస భవన్ కి చేరుకున్నారు. వారికి ప్రచార వ్యూహాన్ని వివరిస్తున్నారు సీనియర్ నేత కేకే. మరోవైపు భాజాపా, కాంగ్రెస్ లకి అభ్యర్థులకి కరువయ్యారు. ఆ పార్టీ తరుపున పూర్థిస్థాయిలో అభ్యర్థులుపోటీ చేయలేదు.