గ్రేటర్ లో భాజాపా, కాంగ్రెస్’లకు అభ్యర్థులే కరువు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్స్ గడువు మరికొద్దిసేపట్లో ముగియనుంది. ఇప్పటికే తెరాస పూర్తి స్థానాలకు గానూ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే భాజాపా, కాంగ్రెస్ లకు మాత్రం అభ్యర్థులే కరువయ్యారు. భాజపా ఇంకా 21 స్థానాలకు నామినేషన్స్ దాఖలు చేయలేదు. కాంగ్రెస్ 60 స్థానాలకుపైగా అభ్యర్థులని ఖరారు చేయలేదు.

అభ్యర్థులు దొరక్కపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. భాజాపా మాత్రం నామినేషన్స్ దాఖలు చేయని 21 స్థానాల్లో ఆసక్తి గల వారు నామినేషన్స్ దాఖలు చేయాలని కోరింది. వారికి బీజేపీ తరుపున బి-ఫారాలు అందజేస్తామని తెలిపారు. దీంతో కొందరు ఆర్థిక బలమున్న వారు నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. వారికి భాజాపా బి ఫారాలు ఇవ్వనుంది. ఇక కాంగ్రెస్ లో సమన్వయం చేసుకొనేవారు కరువయ్యారు. తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న భాజాపా, కాంగ్రెస్ లకి గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరక్కపోవదం హాస్యాస్పదమే.. !