సీక్రెట్’గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు‌ ప్రభుధేవా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొన్నాళ్లుగా బంధువుల అమ్మాయితో రిలేషన్ షిపి లో ఉన్నాడు. త్వరలోనే వీరి పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ప్రభుదేవా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలోనే కాపురం పెట్టేశాడు.

ఇంతకీ ప్రభుదేవా ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా ? డాక్టర్ ని. గతంలో వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా  పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్‌ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. ప్రభుదేవా సీక్రెట్ మ్యారేజ్ విషయం ఆయన స్నేహితుడొకరు బయటపెట్టారు.

ప్రభుదేవాకి ఇదివరకే పెళ్లైన సంగతి తెలిసిందే. 1995లో రామలతను పెళ్లాడాడు. 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌ న‌య‌న‌తారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ పెళ్లి పీఠలు ఎక్కేలా అనిపించింది. కానీ చివరి నిమిషమంలో ఈ జంట బ్రేకప్ చెప్పుకుంది. ఆ తర్వాత నయన్ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. నయన్-విగ్నేష్ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. పెళ్లి ఎప్పుడు ? అన్నది మాత్రం సస్పెన్స్ లో పెడుతున్నారు.