బీజేపీలోకి స్వామి గౌడ్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది తెలంగాణ భాజాపా. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా బీజేపీ నేతలు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ని కలిశారు. ఆయన్ని బీజేపీలో ఆహ్వానించారు. తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత లక్ష్మణ్ లు స్వామి గౌడ్ ఇంటికి వెళ్లారు. చర్చలు జరిపారు. భాజాపాలో చేరేందుకు స్వామి గౌడ్ ఓకే చెప్పారా ? లేదా ?? అన్నది తెలియాల్సి ఉంది.

గత కొంతకాలంగా స్వామి గౌడ్ తెరాసపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన బాహాటంగానే తెరాస అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉద్యమ కారులకి అన్యాయం జరిగిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఆయన బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే స్వామి గౌడ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

మరోవైపు దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్‌తో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  గోషామహల్ డివిజన్ కాంగ్రెస్ టికెట్‌పై కాంగ్రెస్ నాయకత్వంతో విక్రమ్ గౌడ్‌కు విభేదాలు వచ్చాయి. దీంతో గోషామహల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. తన వర్గం నేతలకి ప్రాధాన్యత లభించకపోవడం, భవిష్యత్ భాజాపాదే అని భావిస్తున్నవిక్రమ్ గౌడ్.. ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారమ్.