తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వాయిదా

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ మరింత ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి (సోమవారం) నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానుంది. అయితే నాలుగు రోజుల ఆలస్యంగా ఈ రిజిస్ట్రేషన్స్ మొదలు కానున్నాయ్. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ వాయిదాకి గల కారణాలని మాత్రం తెలియజేయలేదు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రభావం పడకుండా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ని వాయిదా వేసినట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్స్ ధరణి పోర్టల్ లో జరుగుతున్నాయ్. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్స్ కూడా ధరణిలోనే చేయనున్నారు.