రెండో పెళ్లిపై ప్రభుదేవా ఫ్యామిలీ రియాక్షన్
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ హిమాని పెళ్లాడాడు. వీరి పెళ్లి ముంబైలో అత్యంత రహస్యంగా జరిగిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు. నిజం. దీనిపై ప్రభుదేవా స్పందించకున్నా.. ఆయన ఫ్యామిలీ స్పందించింది. ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం స్పందించాడు. ‘బాగుంది.. మీ దగ్గర వివరాలున్నాయి. ప్రభుదేవా పెండ్లి చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది’ అన్నారు.
1995లో రామలతను పెళ్లాడాడు ప్రభుదేవా. 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతలో స్టార్ హీరోయిన్ నయనతారతో ఎపైర్ నడిపాడు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అందరు భావించారు. కానీ.. నయన్ కు ప్రభుదేవా బ్రేకప్ చెప్పేశాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నా.. ప్రభుదేవా సీక్రెట్ గా డాక్టర్ హిమాని పెళ్లి చేసుకున్నారు.