గ్రేటర్ ‘మేనిఫెస్టో’ స్థానంలో ‘ఛార్జ్ షీట్’ రిలీజ్ చేసిన బీజేపీ.. తెరాసపై 60కేసులు !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజాపా కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. ‘ఛార్జ్ షీట్’ పేరుతో ‘మేనిఫెస్టో’ని విడుదల చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఛార్జ్ షీటుని రిలీజ్ చేశారు. ఇందులో తెరాసపై 60 కేసులని ప్రస్తావించారు. ఇందులో పది ప్రధాన సమస్యలని నొక్కి చెప్పారు. మేయర్ పదవి ఎంఐఎం నేత కావాలా ?  లేక బీజేపీ నేత కావాలా ?? గ్రేటర్ ప్రజలు తేల్చుకోవాలని కోరారు.

ఇక గ్రేటర్ ప్రచారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్థావించాలని భాజాపా భావిస్తోంది. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గత గ్రేటర్ ఎన్నికల్లో 30-40లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామిని నెరవేర్చలేదని విమర్శించారు. దీంతో పాటు ఎంఐఎం, తెరాస ఒక్కేటే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజాపా భావిస్తోంది. ఎంఐఎం నేతని మేయర్ ని చేయడానికి తెరాస ప్రయత్నిస్తోందన్నారు. మొత్తానికి… గ్రేటర్ లో భాజాపా వ్యూహాత్మక ప్రచారానికి తెరలేపినట్టు కనిపిస్తోంది.