బన్నీ కూతురి సాంగ్ వెనక త్రివిక్రమ్ స్నేహితుడు

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చేసిన అంజలి.. అంజలి వీడియో కవర్ సాంగ్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటకు పుల్ టెక్నికల్ టీమ్ అంతా పని చేశారు. అయితే ఈ కో ఆర్డినేషన్ అంతా ఎవరిది? డైరక్షన్ ఎవరిది? అన్న క్యూరియాసిటీ వుండనే వుంది. దానికి సమాధానమే సాంగ్ టైటిల్ కార్డ్ ల్లో ఆఖరున వేసిన సాయి గోపాల్ రామ్మూర్తి.

ఇతడు ఎవరో కాదు.. దర్శకుడు త్రివిక్రమ్ స్నేహితుడు. అసిస్టెంట్. రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ క్యాంప్ వదిలేసి బన్నీ దగ్గరకు వచ్చేశాడు. తొలిసారి బన్నీ కూతురు కవర్ సాంగ్ తో వెలుగులోకి వచ్చేశాడు. ఇన్నాళ్లకు ఓ వర్క్ లో టైటిల్ కనిపించింది.