మోనాల్’తో డేటింగ్ ప్లాన్ అట్టర్ ప్లాప్

బిగ్ బాస్ మోనాల్ ని బాగానే వాడుకుంటున్నాడు. మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ ల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీని నడపాలని ప్లాన్ చేశాడు. కానీ అభిజిత్ చాలా త్వరగానే కోలుకొని మోనాల్ ని పక్కనపెట్టడంతో బిగ్ బాస్ ప్లాన్ బెడసి కొట్టేసింది. ఆ తర్వాత మోనాల్ విషయంలో అభిజిత్-అఖిల్ వాదోపవాదాలు హౌస్ ని హీటెక్కించాయి.

అఖిల్-మోనాల్ ల లవ్ ట్రాక్ కొంతలో కొంత వర్కవుట్ అయింది. అయితే ఫైనల్ గా రియలైజ్ అయిన అఖిల్ మోనాల్ ని పక్కనపెట్టేశాడు. ఇప్పుడు మోనాల్ అటు అభిజిత్, ఇటు అఖిల్ కి కాకుండా పోయింది. ఒంటరైపోయింది. ఇది బిగ్ బాస్ కు నచ్చలేదు. దీంతో అఖిల్-మోనాల్-అభిజిత్ ల మధ్య మరోసారి పిల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 

బుధవారం ఏపీసోడ్ లో గతంలో అఖిల్-అభిజిత్ లు కలిసి మోనాల్ ని ఏడిపించారు. కాబట్టి.. వీరిద్దరిలో ఒకరి మోనాల్ ని డేట్ కి తీసుకెళ్లాలని ఆదేశించాడు. అంతేకాదు.. మోనాల్ తో డేటుకి వెళ్లేందుకు అఖిల్-అభిజిత్ ల మధ్య ఓ క్విజ్ కాంపిటీషన్ ఒకటి సెట్ చేశాడు. కానీ మోనాల్ ని ఏడిపించారన్న బిగ్ బాస్ మాటలపై అభిజిత్ అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

తాను మోనాల్ తో డేటుకి వెళ్లనని చెప్పేశాడు. దీంతో.. మోనాల్ తో డేటుకి వెళ్లే అవకాశాన్ని అఖిల్ కి ఇచ్చాడు బిగ్ బాస్. ఒకవేళ నిజంగానే మోనాల్ తో డేట్ కి అభిజిత్ ఒప్పుకుంటే.. అఖిల్-అభిజిత్ ల మధ్య పోటీతో మరోసారి హౌస్ హీటెక్కింది. కానీ అభిజిత్ నో చెప్పడంతో బిగ్ బాస్ ప్లాన్ చేసిన డేటింగ్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. దీంతో మంగళవారం చూపించిన దెయ్యం ఏపీసోడ్ ని పొడగించే ప్రయత్నం చేశారు. అది బోర్ అనిపించింది.