బీజేపీ పెద్దలకి కేటీఆర్ ఆహ్వానం
గ్రేటర్ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతల వెంటపడ్డాడు. రాష్ట్ర నేతలు మాత్రమే కాదు.. కేంద్ర పెద్దలపై తనదైన శైలిలో విమర్శణలు చేస్తూ హైదరాబాద్ ప్రజలని ఆకట్టుకుంటున్నారు. భాజాపా నేతలు అంతా జూటా.. జూమ్లా మాటలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లేది ఎక్కువ. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది తక్కువ అని ప్రజలకి వివరిస్తున్నారు. తెలంగాణ డబ్బులతో పట్నా, అహమ్మాదాబాద్ లని డెలలెప్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక కేంద్ర పెద్దలు హైదరాబాద్ కు క్యూ కట్టడంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు వస్తున్నరంట పది, పన్నెండు మంది కేంద్ర పెద్దలు వస్తున్నారంట. ఉత్తర ప్రదేష్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అమిత్ షా, ప్రధాని మోడీ వస్తున్నారట. వెల్ కమ్ టు హైదరాబాద్. టూరిస్టులకి స్వాగతం. కానీ మన దేశాభివృద్దిలో మీ కేంద్రం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు వేరే రాష్ట్రాల్లో చేస్తున్న అభివృద్దిలో కూడా తెలంగాణ ప్రజల చెమట, రక్తం ఉందన్న మాటని తెలంగాణ ప్రజలకి చెప్పి థ్యాంక్స్ చెప్పి పొమ్మని చెప్పి పొమ్మని డిమాండ్ చేస్తున్నానన్నారు.
కారు గుర్తుకు ఓటేద్దాం.. మన హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం.#HyderabadWithTRS #VoteForCar @KTRTRS @trspartyonline @trsinnews @TNewstg pic.twitter.com/7ytDQLMDUq
— Thirupathi Bandari (@BTR_KTR) November 26, 2020