ఓటీటీలోకి నాగ్ సినిమా

ఇప్పటి వరకు ఓటీటీలో చిన్ని సినిమాలు, యంగ్ హీరోల సినిమాలు మాత్రమే చూశాం. స్టార్ హీరోలు, సీనియర్ స్టార్ హీరోలు ఓటీటీలోకి రాకపోవచ్చు. ఎలాగూ తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ తెరచుకున్నాయ్ అనుకున్నారు. కానీ సీనియర్ హీరో నాగ్ మాత్రం తన సినిమాని ఓటీటీలోనూ రిలీజ్ చేసేందుకు చూస్తున్నారని తెలిసింది.

నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీని నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. నాగార్జున కూడా వైల్డ్ డాగ్ ను ఓటీటీకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. అయితే వైల్డ్ డాగ్ సినిమాను ఒకేసారి ఇటు థియేటర్లతో పాటు, అటు ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చేస్తున్నాడట నాగ్. ధైర్యం, ఆసక్తి ఉన్న వాళ్లు థియేటర్ కు వచ్చి చూస్తారు.. అప్పుడే థియేటర్లు ఎందుకు అనుకునేవాళ్లు ఓటీటీలో చూస్తారు అన్నది నాగ్ ఆలోచనలా కనిపిస్తోంది.