ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ సమావేశం అయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేబినేట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలని మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు.

* కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్‌, జనవరి నెలల్లో చెల్లింపులు

*  కోత విధించిన వేతనాలకు రూ.2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు

* నివర్‌ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

* తుపానుతో రాష్ట్రంలో 30వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1300 ఎకరాల్లో వాణిజ్య పంటలకు నష్టం జరిగింది

* నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

* సుమారు 10వేల మందికి పైగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలింపు

* పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున సాయం

* పంట నష్టంపై డిసెంబర్‌ 15లోపు అంచనాలను రూపొందించి డిసెంబర్‌ 30 నాటికి బాధిత రైతులకు పరిహారం చెల్లింపు 

* పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక

* డిసెంబర్‌ 15న వైఎస్‌ఆర్‌ పంటల బీమా చెల్లింపులు

* ఏపీ గేమింగ్‌ యాక్ట్‌-1974కు సవరణ

* డిసెంబర్‌ 2న ఏపీ అమూల్‌ ప్రాజెక్టు, డిసెంబర్‌ 10న మేకలు, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించాలని ఏపీ కేబినేట్ నిర్ణయించింది.