పనిమంతులను ఓటు ద్వారా ఆశీర్వదించండి
గ్రేటర్ ఎన్నికల్లో పనిమంతులను ఓటు ద్వారా ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ దూసుకెళ్తున్నారు. పలు టీవీ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పలు సదస్సులో పాల్గొంటున్నారు. కులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. మరోవైపు రోడ్ షోస్ చేస్తూ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తున్నారు.
శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో వేర్వేరుగా నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. మతాన్ని అడ్డం పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేస్తూ నాలుగు ఓట్లు రాల్చుకోవాని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోనైనా పడ్డాయా అని నిలదీశారు. ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. మరి ఆ ప్యాకేజీ ద్వారా ఎవరికైనా ఒక్క రూపాయి లబ్ధి జరిగిందా అని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.