ప్రకాష్ రాజ్’కు నాగబాబు కౌంటర్

గ్రేటర్ ఎన్నికల నుంచి జనసేన అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 50 స్థానాల్లో జనసేన నామినేషన్స్ దాఖలు చేసింది. అయితే బీజేపీ మద్దతు కోరడంతో పోటీ నుంచి తప్పుకొని.. ఆ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీనిపై విమర్శలొస్తున్నాయ్. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా జనసేన నిర్ణయంపై మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ కు నిలకడ లేదు. ఇతర పార్టీ కోసం సొంత పార్టీని బలి చేయడం ఏంటీ ? అని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ చంద్రుడు, ఇంద్రుడు అంటూ ఒకరికి సపోర్టుగా నిలిచారు. ఆ తర్వాత ఆయన మోసం చేశారని ప్రజల ముందుకెళ్లారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లోనూ భాజాపా కోసం పోటీ నుంచి వైదొలిగారని విమర్శించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగాబాబు కౌంటర్ ఇచ్చారు.

గ్రేటర్ లో జనసేనకు మద్దతు ఇవ్వడం వెనక సుదీర్ఘ ప్రయోజనాలున్నాయ్. ముందు నీ బుద్ది మార్చుకో అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నోటులాంటిది షేర్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ మాటలపై పవన్ మాత్రం స్పందించలేదు. మరోవైపు ప్రకాష్ రాజ్ మాటల్లో తప్పేమీ లేదని జనసేన వర్గాలు కూడా అనడం విశేషం.