గ్రేటర్ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ల్లేవ్ !
ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓటింగ్ ముగిసిన వెంటనే అందరు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎదురు చూస్తుంటారు. ఈరోజు జరుగుతున్న గ్రేటర్ పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయ్. గ్రేటర్ పీఠం ఎవరిది ? అన్నదానిపై దాదాపు క్లారిటీ రానుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీనికి కారణం ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ 26లో పోలింగ్ రద్దు కావడమే.
అక్కడ సీపీఐ గుర్తు బదులుగా సీపీఎం గుర్తు వచ్చింది. ఈసీ గుర్తులు పరిశీలించి పోలింగ్ రద్దు చేసింది. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తికొడవలి నక్షత్రం గుర్తు రావడంతో ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఓల్డ్ మలక్‌పేట్‌లో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ను నిలిపివేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రం వెలువడాల్సిన ఎగ్జిట్ పోల్స్ ని రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.
ఎన్నికల సంఘం చేసిన తప్పిందంతో టీవీ ఛానెల్స్ నోట్లో మన్నుపడినట్టయింది. ఎగ్జిట్ పోల్స్ ఏపీసోడ్స్ తో న్యూస్ ఛాలెన్స్ టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోయింది. అయితే ఎన్నికల సంఘం పొరపాటుతో ఎగ్జిట్ పోల్స్ లేకుండా పోయాయ్. అయితే టీవీ ఛానెల్స్ ని ఎన్నికల సంఘం ఆపగలదు. కానీ సోషల్ మీడియాను ఆపలేదుగా. ఈ సారి గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్ ని సోషల్ మీడియా రివీల్ చేయనుంది.