లాక్కోవద్దు, పీకొద్దు అంటే.. గెలిచేదెలా ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే మెడ‌ల్ కోసం ఇంటి సభ్యులు హోరాహోరీగా పోరాడుతున్నారు. టికెట్ టు ఫినాలే మొద‌టి లెవ‌ల్‌లో అఖిల్‌, అభిజిత్‌, హారిక‌, సోహైల్ విజ‌యం సాధించారు. వీరి మ‌ధ్య నేడు రెండో లెవ‌ల్ పోటీ జ‌రగ‌నుంది. నిన్న పాలు పిత‌డ‌కడం అనే టాస్క్ పెట్టిన బిగ్‌బాస్ నేడు పూలు విస‌ర‌డం టాస్క్ పెట్టాడు. ఇందులో హారిక మ‌గాళ్ల‌తో ధీటుగా ఆడేందుకు ప్రయత్నించడం తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో చూడొచ్చు.

ఇందులో హారిక అసంతృప్తిని కూడా వెల్లగక్కింది. చేతుల్లోంచి లాక్కోవ‌ద్దంటారు, అక్క‌డ మ‌ట్టిలో పీకొద్దంటారు. ఇలాగైతే ఎట్లా గెలిచేది ? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక సోషల్ మీడియాకు అందిన లీకుల ప్రకారం.. అఖిల్‌, సోహైల్ మూడో లెవ‌ల్‌కు అర్హ‌త సాధించారు. అందులో అఖిల్ మెడ‌ల్ సొంతం చేసుకుని టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్నారు. ఇదే నిజమైతే టాప్ 5లోకి దూసుకెళ్లిన మొదటి సభ్యుడు అఖిల్ అవుతాడు. మరీ.. ఈ జాబితాలో స్థానం సంపాదించుకోనున్న మిగితా నలుగురు ఎవరు ? అన్నది తెలియాలంటే.. ? మరో రెండు వారాలు ఓపిక పట్టాల్సిందే.