ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం

కరోనా భయంతో పార్లమెంట్ సమావేశాలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు కుదించబడిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడేలా ఉంది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయింది.

మూడ్రోజులుగా  కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుమురి హాజరు అయ్యారు. దాంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు నిన్న అసెంబ్లీలో కారుమురి నాగేశ్వరావు ప్రసంగించారు. కోవిడ్ రావడంతో అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వర్‌రావు దూరం అయ్యారు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకీ గైర్హజరు అయ్యారు.