‘కరోనా వైరస్’ రెండో ట్రైలర్ చూశారా ?

మహమ్మారి ‘కరోనా వైరస్’పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ కూడా ‘కరోనా వైరస్’నే. తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ ని వదిలారు. అనుబంధం, అప్యాయత, సంతోషాలతో నిండిన కుటుంబంలో కరోనావైరస్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తితే.. కుటుంబసభ్యులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే విషయాన్ని ఇందులో చూపించారు.

కరోనా వైరస్‌.. ఎప్పుడు, ఎక్కడ, ఎవర్నుంచి వస్తుందో తెలియడం లేదు. కాబట్టి, నాకు చెప్పకుండా ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లేది లేదు అంటూ శ్రీకాంత్‌ చెప్పిన ‌డైలాగ్‌లు.. లాక్‌డౌన్‌ సమయంలో కొవిడ్‌-19 పట్ల ప్రజలు పడిన భయాన్ని తెలియజేసేలా ఉంది. ఈ నెల 11న కరోనా వైరస్ ని రిలీజ్ చేస్తున్న వర్మ ప్రకటించారు.లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి సినిమా ఇది.