GHMC ఎలక్షన్స్ ఎఫెక్ట్.. తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ !

జీహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలో కరోనా విజృంభించే అవకాసం ఉంది. సెకండ్ రావొచ్చని వైద్య నిపుణులు అంచనా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నాయకులు, ప్రజలు కరోనా నిబంధనలని తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతల రోడ్ షోస్ కిక్కిరిసిపోయాయ్. మాస్కుల్లేవ్. సామాజిక దూరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభించనుందని చెబుతున్నారు.

అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు కచ్చితంగా హోం అసోషలేషన్ లో ఉండాలని చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలు 5 నుంచి 7 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరి 96శాతానికిపైగా ఉంది. బెడ్ ల ఆక్యుపెన్సీ 11శాతం మాత్రమే ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఎఫెక్ట్ తో తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.