మూడో వన్డేలో టీమిండియా విజయం

ఆసీస్‌తో ఆఖరి వన్డేలో కోహ్లీసేన గెలిచింది. పరువు నిలుపుకుంది. సిరీస్‌ను 1-2 తేడాతో ముగించి క్లీన్‌స్వీప్‌ తప్పించుకుంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్యా (92), రవీంద్ర జడేజా (63), కోహ్లీ (63) రాణించారు.

303 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కంగారూలను 289కే ఆలౌట్‌ చేసింది. 13 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. ఆరోన్‌ ఫించ్‌ (75), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (59) అర్ధశతకాలతో చెలరేగారు. మ్యాక్స్‌వెల్ కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. విజయానికి మరో 33 బంతుల్లో 35 పరుగులు అవసరమైన సమయంలో బుమ్రా యార్కర్‌కు క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఆసీస్ ఆటగాళ్లని కట్టడి చేయడం లో టీమిండియా ఆటగాళ్లు సక్సెస్ అయ్యారు.