అదరగొట్టిన పాండ్యా (92), జడేజా (66).. ఆసీస్ టార్గెట్ 303

మూడో వన్డేలో ఆసీస్ ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్యా (92), రవీంద్ర జడేజా (63) అదరగొట్టారు. ఆఖరులో గేర్ మార్చి ఆసీస్ బౌలర్లపై ఎటాక్ కి దిగారు. దీంతో స్కోర్ బోర్డ్ ని 300 దాటించారు. విరాట్ కోహ్లీ (63) మరోసారి ఆకట్టుకున్నారు. ధావన్ (16), గిల్ (33), శ్రేయస్ అయ్యర్ (19), కె ఎల్ రాహుల్ (5) తక్కువ పరుగులకే పరిమితం అయ్యారు.

ఇక 303 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం భారత  బౌలర్లకి అంత ఈజీ కాదు. గత రెండు వన్డేలో ఆసీస్ 375, 390 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 303 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా కట్టుదిట్టమైన  బౌలింగ్ చేయాల్సి ఉంది.