యాహూ.. టాప్-10లో అల్లు అర్జున్ !

‘యాహూ’ వేదికగా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాని విడుదల చేశారు. ఈ జాబితాలో మోస్ట్ సర్చ్‌డ్ పర్సనాలిటీగా స్థానాన్ని బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సొంతం చేసుకొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. యాహూ ఇండియా సెర్చ్ ఇంజన్ రిలీజ్ చేసిన గణాంకాల్లో సుశాంత్ అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు.

ఈ జాబితాలో అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌, రిషీ కపూర్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సోనూసూద్‌, అనురాగ్‌ కశ్యప్‌, రియా చక్రవర్తి, కంగన రనౌత్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లు తదితరులు ఉన్నారు. టాప్-10లో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. ఆయనది పదో స్థానం. ఈ యేడాది అల.. వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలు అంతర్జాతీయ ప్రేక్షకులని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.