గ్రేటర్ ఫలితాలపై ప్రధాని ఆరా
గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఫలితాలే రావాల్సి ఉంది. ఎల్లుండి (డిసెంబర్ 4) ఫలితాలు రానున్నాయ్. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గ్రేటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. బుధవారం ప్రధాని మోడీ తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడారట.
గ్రేటర్ ఎన్నికలపై ఆరా తీశారట. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపా శ్రేణులు అద్భుతంగా పనిచేశారని అభినందింరు. ఇక ముందు కూడా ఇదే స్పూర్తితో పని చేయాలని సూచించారని బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాలపై ప్రధానికి వివరించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఇక గ్రేటర్ ఫలితాలపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వందకుపైగా స్థానాల్లో గెలుస్తామని తెరాస, తెరాస ఆధిపత్యానికి గండికొడతామని భాజాపా అంటున్నాయి.