ప్రభాస్.. ది మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్ !

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బాహుబలి ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. కేజీఎఫ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ ప్రచారమే నిజమైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. టైటిల్, ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

‘సలార్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌… ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం అంటూ ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఉండనుంది.