వైరల్ : రేణు షేర్ చేసిన మధుర జ్ఝాపకం

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ మధుర జ్ఝాపకాన్ని తన ఇన్ స్టా గ్రాములో షేర్ చేసింది. కూతురు, కొడుకును ఇరువైపుల కూర్చొపెట్టుకుని వారిని ముద్దాడుతున్న పవన్‌ ఫొటో ఇది.కొన్ని మధురమైన జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అరుదైన ఫొటోను నా కెమెరాలో బంధించాను. ఇలాంటి అందమైన ఫొటోలు కేవలం నా ఫోన్‌ గ్యాలరీకే పరిమితం కాకుడదని షేర్‌ చేశానని రేణు రాసుకొచ్చింది.

పవన్-రేణు వ్యక్తిగత కారణాల వలన విడిపోయినా.. పవన్ వెళ్లి పిల్లలని కలుస్తుంటారు. వారితో సరదాగా గడుపుతుంటారు. తాజాగా రేణు షేర్ చేసిన మధురజ్ఝాపకం దీనికి సంబంధించినదే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం తెలుగు టీవీ షోస్ తో బిజీగా ఉన్న రేణు.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ వరుస సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు రాజకీయాలని చేస్తున్నారు పవన్.