సంతృప్తి పరచకపోవడంపై సారా వివరణ
వరుణ్ ధావన్-సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం ‘కూలీ నం.1’. 1995లో గోవిందా-కర్మిషాకపూర్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘కూలీ నం.1’కి ఇది రీమేక్. దీంతో ఇటీవల విడుదలైన ‘కూలీ నం.1’ ట్రైలర్ చూసి.. కర్మిషా కపూర్ స్థాయిలో సారా నటించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ కామెంట్స్ పై సారా స్పందించారు.
“కూలీనం.1’కు రీమేక్‌గా మా సినిమా అనుకున్న సమయంలోనే ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహించాం. అయితే, ‘కూలీనం.1’ని రీమేక్ చేసినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని మా చిత్రాన్ని తెరకెక్కించాం. నా నటనను ఆనాటి కరిష్మాతో పోల్చడం సరికాదు. ఆమె అద్భుతమైన నటి. నటిగా ఆమె ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.
ఆమె పోషించిన పాత్రలో నేను నటించాను తప్ప ఆమెలా నటించలేదు. కర్మిషాలా నటించడం అసాధ్యం కాబట్టి.. ఆమెని కాపీ కొట్టేబదులు ఆ పాత్రకు కొత్తదనం తీసుకురావాలనుకున్నాం. అందుకే నేను నాలా నటించాను. అలాగే, వరుణ్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది” అని చెప్పింది.