ఒక్కరోజే 2500 కరోనా మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 2,500 మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు అమెరికాలో 1,80,000లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయ్. 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 1.37కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 2,70,000లకు పైగా మరణాలు సంభవించాయి. అమెరికాలో ఇప్పుడు పండగ సీజన్. గత కొద్ది రోజులుగా అమెరికన్లు తమ బంధువులను కలుసుకునేందుకు విపరీతమైన ప్రయణాలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా వేడుకలు చేసుకుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.