దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మునుపటితో పోలిస్తే చాలా తక్కువ కేసులే నమోదవుతున్నాయ్. అయితే కరోనా తిరిగి విజృంభించే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 35,551 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసులు సంఖ్య 95 లక్షల మార్కును దాటింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95,34,964 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. రోజురోజుకూ క్రియాశీల రేటు(4.44శాతం)తగ్గడం, రికవరీ రేటు( 94.11శాతం) పెరుగుతుండటం కాస్త ఊరట కలిగించే పరిణామం. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,22,943గా ఉంది. అలాగే, 89,73,373 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. మరోవైపు, గడిచిన 24గంటల్లో 526 మంది మరణించగా..ఇప్పటి వరకు 1,38,648 మంది ప్రాణాలు కోల్పోయారు.