రచయితగా దిల్ రాజు భార్య

ఓటిటిలు, ఏటిటిలు, థియేటర్లు అన్నీ కలిసి ఇప్పుడు సినిమా వ్యాపారాన్ని మరింత విస్తరించాయి. ఇలాంటి నేపథ్యంలో కథలు. కాన్సెప్ట్ లు. కొత్త ఐడియాలు కావాలి. ఇందుకోసం కొత్త రచయితలు రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు సతీమణి కూడా కథ రచయిత్రిగా మారుతున్నారని తెలుస్తోంది.

ఆమె ఓ పాయింట్ డెవలప్ చేసారని తెలుస్తోంది. దాన్ని సిన్మా స్క్రిప్ట్ గా మార్చడానికి ఓ టీమ్ ను దిల్ రాజు సెట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఆ టీమ్ సహకారంతో ఆమె స్క్రిప్ట్ తయారు చేస్తే, సినిమా తెరకెక్కడం పెద్ద కష్టమేం కాదు. అలా వచ్చిన సినిమా హిట్టయితే.. దిల్ రాజు సతీమణి నుంచి మరిన్ని కొత్త కథలు రావొచ్చు.