జనవరిలో రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ! డిసెంబర్ 31న ప్రకటన !!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫైనల్ గా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రజనీ ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు.

“త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు” అని రజనీకాంత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.