బీజేపీ గ్రేటర్ లక్ష్యం నెరవేరినట్టేనా ?

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో తెలంగాణ భాజాపాకు ఊపొచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ విధంగానే గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు. అందుకు తగ్గట్టుగానే తాజా ఫలితాలు కూడా ఉన్నాయ్. గ్రేటర్ లో భాజాపా 30 నుంచి 40 స్థానాలు గెలుచుకోబోతున్నట్టు తాజా ట్రెండ్ ని చూస్తే అర్థమవుతోంది. ఈ లెక్కన గ్రేటర్ లో భాజాపా లక్ష్యం నెరవేరినట్టే అనిపిస్తోంది.

గత గ్రేటర్ ఎన్నికల్లో భాజాపా నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇప్పుడీ ఆ సంఖ్య 40కి చేరనుంది. ఇదీగాక.. ఓడిపోయిన చోట కూడా భాజాపా రెండో స్థానాల్లో నిలిచింది. కొన్ని చోట్ల తగ్గాపోరు పోటీనిచ్చింది. పదుల సంఖ్యలో తేడాతో ఓడిపోయింది. దీంతో.. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని గ్రేటర్ సాక్షిగా భాజపా నిరూపించుకున్నట్టయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.