గ్రేటర్ ఫలితాలు : తెరాసకు తొలి షాక్

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తెరాసకు తొలి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అత్యధిక స్థానాల్లో భాజాపా ముందంజలో ఉంది. అయితే పోస్టర్ బ్యాలెట్ ఓట్లు చాలా తక్కువగా ఉంటాయ్. 50లోపే పోస్టర్ బ్యాలెట్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాన్ని నిర్ణయించలేవ్. కానీ నైతికంగా చూస్తే మాత్రం గ్రేటర్ ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెరాసకు షాక్ ఇచ్చినట్టే. 

బ్యాలెట్ ఓట్లలోనూ పోస్టర్ల్ బ్యాలెట్ ఓట్ల ట్రెండ్ కొనసాగితే గ్రేటర్ లో భాజాపా హవా కనిపించినట్టే. మొత్తంగా గ్రేటర్‌లో 1,926 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయ్. ఇందులో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లకుండా పోయాయి.  పోస్టర్ల్ బ్యాలెట్ ఓట్లలో  బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… రెండోస్థానానికి పరిమితం అయిన టీఆర్ఎస్ 35 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఇక, ఎంఐఎం పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది.