కరోనా వాక్సీన్’పై ప్రధాని కీలక ప్రకటన
ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. మరికొన్ని వారాల్లోనే కరోనా వాక్సిన్ రాబోతుందని ప్రకటించారు. ఈరోజు కరోనా వాక్సిన్ పై ప్రధాని మోడీ అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. మరికొన్ని వారాల్లోనే కరోనా వాక్సిన్ రానుందన్నారు. మన శాస్త్రవేత్తలు కరోనా వాక్సిన్ పై నమ్మకంగా ఉన్నారని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతోనే వాక్సిన్ రెడీ చేస్తున్నారని తెలిపారు.
కరోనా వాక్సిన్ పంపిణీపై కూడా ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. కోటిమంది కరోనా వారియర్స్ కి మొదట కరోనా వాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్దులకు వ్యాక్సినేషన్‌లో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మోదీ చెప్పారు.
వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర బృందాలు కలిసి పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు.. భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీ కోసం భారీ నెట్‌వర్క్ ఉందని అన్నారు. రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాతనే వ్యాక్సిన్ ధరపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు.