ఆదిపురుష్.. రావణాసురుడి పాత్ర లీకు !

బాహుబలి ప్రభాస్ నటించనున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ ని తెరకెక్కించనున్నట్టు సమాచారమ్.

రామాయణం యుద్దకాండ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైఫ్.. తన పాత్రకు సంబంధించిన కొన్ని వివరాలని బయటపెట్టారు.

‘నా పాత్ర పేరుని లంకేష్. లంకేష్‌ పాత్ర నెగెటివ్‌ రోల్‌ అయినప్పటికీ దర్శకుడు ఆ పాత్రకి మానవతా కోణాన్ని జోడించాడు. లక్ష్మణుడు..సూర్పణక ముక్కు కోయడం, వంటి విషయాల్లో లంకేష్‌ మానవతా కోణాన్ని చూపించనున్నారు’ అనిచెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా సీత పాత్రలో కృతి సనన్ ని తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ ప్రారంభం అవుతోంది. ఆర్నెళ్లలో షూటింగ్ పూర్తి చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి అధిక సమయం తీసుకోనున్నారని చెబుతున్నారు. ఆదిపురుష్ తో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయాల్సి ఉంది.