తల్లికాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ !

మొదట బుల్లితెర.. ఆ తర్వాత వెండితెరను దున్నేస్తోంది. మధ్యలో బిగ్ బాస్ షోలో మెరిసింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఆమె ఎవరని. హరితేజ. ఇప్పుడు ఆమె కడుపు పండింది. త్వరలోనే తల్లికాబోతుంది. ఈ శుభవార్తని ఓ వీడియో ద్వారా ఆమె ప్రేక్షకులతో పంచుకుంది. అందులో తల్లికాబోతున్నాననే ఆనందంలో చిందులు వేస్తూ కనిపించింది హరితేజ.

హరితేజ తొలుత సీరియల్స్ లో నటించింది. అనంతరం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత హరితేజ నటిగా మరింత బిజీ అయింది. ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అక్క, చెల్లి, వదిన, స్నేహితురాలు పాత్రలో ఎక్కువగా కనిపిస్తుంది.