డబ్ల్యూహెచ్‌వో నుంచి తీపికబురు

మహమ్మారి  కరోనా విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). కరోనా కాలం ఇంకా సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వచ్చింది. అయితే తొలిసారి డబ్ల్యూహెచ్‌వో నుంచి తీపికబురు వచ్చింది. ప్రపంచం ఇక మహమ్మారి విపత్కాలం ముగింపుపై కలలు కనే సమయం ఆసన్నమైందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దీంతో అతి త్వరలోనే కరోనా వాక్సిన్ రాబోతుందని క్లారిటీ ఇచ్చినట్టయింది.

ఇక వ్యాక్సిన్‌ విషయంలో పేద, మధ్యాదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించరాదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా అంతానికి సమయం దగ్గరపడ్డప్పటికీ.. ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా ఉందన్నారు. పరోక్షంగా పేద దేశాలకు టీకా అందుబాటులోకి రావడంపై ఉన్న సందేహాలను వ్యక్తం చేశారు.