అభిజిత్’కు జైలు శిక్ష

ఇంటి సభ్యులు ఆనందంగా ఉంటే బిగ్ బాస్ తట్టుకోరు. ఓర్వరు. వారి మధ్య చిచ్చుపెట్టేందుకు స్కెచ్ లు వేస్తుంటాడు. శుక్రవారం ఏపీసోడ్ లోనూ బిగ్ బాస్ అదే చేశారు. సభ్యులంతా కలిసిపోయారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అందరు కలిసి హగ్ చేసుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బిగ్ బాస్.. వారిని విడదీసేందుకు ర్యాంక్ టాస్క్ రూపంలో ఓ స్కెచ్ వేశాడు. 1 నుంచి 6 వరకు ర్యాంకర్లని ఏర్పాటు చేసి.. ఎవరు ఏ ర్యాంకుకు సరిపోతారో తేల్చుకోవాలని చెప్పారు.

వాస్తవానికి ఈ ర్యాంకుల కోసం సభ్యులంతా కొట్లాడాలి. గొడవపడాలి. కానీ అంతకు ముందే అందరు కలిసిపోయిన నేపథ్యంలో ర్యాంకుల కోసం పెద్దగా రచ్చ చేసుకోలేదు.  సోహైల్ మొదటి స్థానంలో, రెండో స్థానంలో అరియానా, మూడో స్థానంలో హారిక, నాల్గో స్థానంలో మోనాల్‌, ఐదో, ఆరో స్థానాల్లో అవినాష్‌, అభిజిత్‌ నిలబడ్డారు. దీంతో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న సోహైల్ ని సీజన్ బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా, వరస్ట్‌ ఫెర్మార్మర్‌గా అభిజిత్‌ను ప్రకటించాడు. వరస్ట్ పర్‌ఫార్మర్ అయిన కారణంగా అభిజీత్‌కి జైలు దుస్తులు వేసి జైలుకి పంపించారు. అభిజిత్ ఈ సీజన్ విజేతగా నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి అభిజిత్ కు జైలు శిక్ష తప్పలేదు.