ప్రజలకు మత్తు ఎక్కించి భాజాపా గెలిచిందట
గ్రేటర్ లో భాజాపా గ్రేట్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ లో అనూహ్యంగా పుంజుకున్న భాజాపా ఏకంగా 48 స్థానాల్లో గెలిచింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించింది. అయితే గ్రేటర్ లో భాజాపాగెలుపుపైకాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మతం మత్తు ఎక్కించి బీజేపీ ఓట్లు పొందుతోందని విమర్శించారు.
పీసీసీ మార్పుపై కూడా మధుయాష్కీ స్పందించారు. పీసీసీ అధ్యక్షునిపై సోనియా నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చిన అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.