రైతుల ఆందోళన.. రంగంలోకి దిగిన ప్రధాని !

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని రైతులు ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న రైతులు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే వారితో రెండు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ అవి ఫలించలేదు. ఈరోజు మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. మరోవైపు చర్చలు సఫలం కాకుంటే ఈ నెల 8న భారత్ బంద్ కు పిలుపునిస్తామని రైతులు  హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.

తాజాగా ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఈ ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో ప్రధాని సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. రైతు సంఘాలు లేవనెత్తుతున్న అంశాలు, చట్టాల రద్దు డిమాండ్లపై వ్యవహరించాల్సిన వైఖరిపై ప్రధానితో మంత్రులు మాట్లాడుతున్నారు.\