మోనాల్ లవ్ లో బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఓ సినిమా అనుకుంటే. అందులో మోనాల్ ఓ ఐటమ్ నెంబర్. దాన్ని డిలీట్ చేసే ధైర్యం బిగ్ బాస్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే మోనాల్ తో బిగ్ బాస్ లవ్ లో పడిపోయినట్టు అనిపిస్తోందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారమైనా మోనాల్ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే.. అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇక బిగ్ బాస్ తీరు మారదు. మోనాల్ తో బిగ్ బాస్ పీకల్లోతు లవ్ లో ఉన్నట్టున్నాడని చెప్పుకొంటున్నారు.

వాస్తవానికి మోనాల్ ఎప్పడో ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. మోనాల్ కోసం కుమార్ సాయి బలి చేశారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోనాల్ కంటే లాస్య, మెహబూబ్ కు తక్కువ ఓట్లు పడటం.. వారు ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో బెస్ట్ ఎంటర్ టైనర్ అవినాష్ కూడా మోనాల్ కోసం ఎలిమినేట్ చేశారని చెప్పుకొంటున్నారు. బిగ్ బాస్ కు ప్రేక్షకులు వేసే ఓట్లతో సంబంధం లేదు. వారిని దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టు బిగ్ బాస్ తీరు కనిపిస్తోంది. కొంపదీసి.. మోనాల్ ని బిగ్ బాస్ విజేతని చేయరుగా.. ! అని జోకులు పేలుస్తున్నారు.