జీహెచ్ఎంసీ ఎఫెక్ట్.. కేటీఆర్’లో స్పష్టమైన మార్పు !

గ్రేటర్ ఫలితాలతో మంత్రి కేటీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఎన్నికల్లో గెలవడంపైనే కేటీఆర్ దృష్టించారు. ఇప్పుడు మాత్రం పార్టీలోని కీలక నేతలు భాజాపాలో చేరకుండా జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది. ఖమ్మం పర్యటనకు వెళ్లిన కేటీఆర్ అక్కడ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, అజయ్ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వర్ రావు కలసి పొంగులేటి ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు.

రాబోయే ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, గ్యాడ్యుయేట్‌ ఎంఎల్‌సీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సేవలను వినియోగించుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పొంగులేటి, తుమ్మలలో పార్టీ మార్పు ఆలోచన రాకుండా.. కేటీఆర్ జాగ్రత్తపడుతున్నట్టు ఆయన తాజా కదలికలని బట్టీ అర్థమవుతోంది. ఇక ఖమ్మం పర్యటనలో రూ 1.25 కోట్లతో నిర్మించిన ఖనాపురం మినీ ట్యాంక్ బండ్, రూ.2.85 కోట్లతో బల్లెపల్లి లో నిర్మించిన అత్యధునాతన వైకుంఠధామంను మంత్రి కేటీఆర్, మహమూద్ అలీ , రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.